ఘనంగా శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవం
గుంటూరు: చేబ్రోలు మండలం గరువుపాలెంలో శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. జాతర సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం సంతరించుకుని కళకళలాడింది. భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ మహోత్సవాన్ని తుళ్ళూరు కృష్ణ చైతన్య (చిన్ని) అండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.