'ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తు చేసుకోండి'

'ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తు చేసుకోండి'

MBNR: జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం జిల్లాలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల, నవోదయ, గురుకుల, కేంద్రీయాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని డీఈవో ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13 సాయంత్రంలోపు ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.