బీజేపీ మండల అధ్యక్షుడిగా శివాజీ ప్రసాద్
SKLM: ఆమదాలవలస రూరల్ మండల బీజేపీ అధ్యక్షుడిగా బండి. శివాజీ ప్రసాద్ గురువారం నియమితులయ్యారు. రాష్ట్ర పార్టీ సూచన మేరకు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి. సూరపు నాయుడు శివాజీ ప్రసాద్‌కు నియమక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.