'ఏయూ ఇంజనీరింగ్ కళాశాల తరగతులు రద్దు'
VSP: AU కళాశాల మైదానంలో పార్ట్‌నర్‌షిప్ సమిట్-2025 నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం నుంచి 15వ తేదీ వరకు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు తరగతులను రద్దు చేస్తున్నట్లు ఆచార్య కె. రాంబాబు పేర్కొన్నారు. హాస్టల్ విద్యార్థులు తమ గుర్తింపు కార్డులను చూపి బయటకు వెళ్లొచ్చని తెలిపారు. విద్యార్థులు మద్దిలపాలెం గేటును, విద్యార్థినులు పోలమాంబ ఆలయం పక్కన గేటును వినియోగించుకోవాలని కోరారు.