మున్సిపల్ ఎన్నికలు.. రంగంలోకి శ్రీధర్ బాబు
రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల పార్లమెంటు ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికల కోసం మంత్రి శ్రీధర్ బాబు రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రి శ్రీధర్ బాబును స్క్రీనింగ్ కమిటీ ఛైర్ పర్సన్ అభ్యర్థిగా నియమించింది. స్థానిక నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, స్టార్ కాంపైనర్లతో భారీగా ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు.