నిప్పుల కొలిమిలా నిజామాబాద్ జిల్లా
NZB: జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. గడిచిన 24 గంటల్లో జిల్లాలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. అత్యధికంగా ఎడపల్లి, ఆర్మూర్ మండలంలోని పెర్కిట్లో 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ రూరల్, డిచ్పల్లి, మాక్లూర్ మండలాల్లో కూడా 44 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి.