'అధికారులు త్రాగునీటి పైపులైను లీకేజీలను పట్టించుకోండి'

KDP: కమలాపురంలోని పాత HP పెట్రోల్ బంక్ సమీపంలో నెలల తరబడి త్రాగునీటి పైపులైన్ పగిలిపోయి నీరు వృధా అవుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పెట్రోల్ బంక్ వద్ద అధికారులు తరచుగా తిరుగుతున్నా, పగిలిపోయిన పైపులైనును చూసి పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నారని, తమకేమీ తెలియదనే ధోరణిలో ఉన్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.