ఆదీవాసీలకు అండగా ప్రభుత్వం ఉంటుంది

KMM: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సత్తుపల్లి మున్సిపల్ ఆఫీస్ ఎదుట కొమరం భీమ్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదివాసీ సోదరులు, మహిళలు, కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీ కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.