VIDEO: పోచమ్మ ఆలయ పునః నిర్మాణానికి భూమి పూజ
KNR: శంకరపట్నం మండలంలోని కేశవపట్నం పరిధి పాపయ్య పల్లెలో పోచమ్మ ఆలయ పునర్నిర్మాణానికి గ్రామస్థులు శ్రీకారం చుట్టారు. గురువారం శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు. ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా వర్ధిల్లాలని, పునర్నిర్మాణం వల్ల గ్రామం సుభిక్షంగా ఉంటుందని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.