ఆముదార్లంక సందర్శించిన అవనిగడ్డ డీఎస్పీ

ఆముదార్లంక సందర్శించిన అవనిగడ్డ డీఎస్పీ

కృష్ణా: చల్లపల్లి మండలంలోని వరద ప్రభావిత గ్రామం ఆముదార్లంకను అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ గురువారం సాయంత్రం సందర్శించారు. గ్రామంలోని పల్లపు ప్రాంతంలో ప్రజలను కలిసి వరద పరిస్థితి వివరించారు. విధుల్లో ఉన్న రెవిన్యూ, పోలీస్, గ్రామ పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. వరద మరింతగా పెరిగితే ప్రభుత్వ ఆదేశాల మేరకు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు.