నేడు కాణిపాకంలో పవర్ కట్

CTR: కాణిపాకంలో తక్కువ ఎత్తులో కరెంట్ వైర్లను సరిచేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ కిరణ్ కుమార్ తెలిపారు. ఈనెల 27 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తుల భద్రత దృష్ట్యా తక్కువ ఎత్తులో ఉన్న వైర్లను మార్చనున్నారు.