ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
CTR: పుంగనూరు లోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం స్వామి వివేకానంద జయంతి వేడుకలను ABVP వారు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన మహా తత్వవేత్త అని కొనియాడారు. యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, క్రమశిక్షణను నూరిపోసిన వ్యక్తిగా స్వామీ వివేకానంద నిలిచారన్నారు.