ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించిన బీజేపీ చీఫ్

ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించిన బీజేపీ చీఫ్

HYD: ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉన్నా లేకున్నా విశ్వసించమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని గంటల్లో ఫలితాలు రాబోతున్నాయని, ఎవరు ఏంటో తేలిపోతుందన్నారు. విజయం వస్తే పొంగిపోమని, ఓటమి చెందితే కుంగిపోమని ఆయన పేర్కొన్నారు. కాగా, రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే.