ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు పూర్తి

ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు పూర్తి

SRCL: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి హుండీలు బుధవారం లెక్కించారు. రూ.1,97,54,588 వచ్చినట్లు ఈవో రాధా బాయి తెలిపారు. కానుకల రూపంలో బంగారం 170 గ్రాములు రాగా.. మిశ్రమ వెండి 10 కిలోల 300 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. 34 రోజులకు గానూ ఈ ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. ఆలయ అధికారులు, సేవా సమితి సభ్యులు ఉన్నారు.