బీసీ మహిళలకు న్యాయం చేయండి: ఇందిరా శోభన్

బీసీ మహిళలకు న్యాయం చేయండి: ఇందిరా శోభన్

TG: చట్టసభల్లో మహిళలకు కల్పించే 33% రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌లను కలిసి ఆమె వినతిపత్రం సమర్పించారు. కేంద్రం తెచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలకు ఉపకోటా లేకపోవడం అన్యాయమని, అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేయాలని కోరారు.