గాంధీ మెట్రో స్టేషన్ వద్ద గుర్తుతెలియని డెడ్ బాడీ
HYD: గాంధీ ఆస్పత్రి మెట్రో స్టేషన్ వద్ద గుర్తుతెలియని డెడ్ బాడీ వెలుగు చూసింది. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1027 సమీపంలోని మెట్రో మెట్ల వద్ద పడి ఉన్న దాదాపు 35-40 ఏళ్ల వ్యక్తి డెడ్ బాడీని సిబ్బంది గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి చూడగా ఎలాంటి వివరాలు లభించలేదు.