పశువుల యజమానులకు పంచాయతీ వారి హెచ్చరిక

GNTR: తుళ్లూరు గ్రామంలో రోడ్లపైకి వస్తున్న పశువుల వల్ల వాహనదారులకు, ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం పంచాయతీ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. సోమవారం ఉదయం నాటికి పశువుల యజమానులు తమ పశువులను రోడ్ల నుంచి తరలించాలని, లేని యెడల వాటిని బందెల దొడ్లకు తరలిస్తామని హెచ్చరించింది.