గుంతలతో అధ్వానంగా రోడ్డు మార్గం

గుంతలతో అధ్వానంగా రోడ్డు మార్గం

SKLM: ఎచ్చెర్ల మండల కేంద్రం నుంచి బడివానిపేట, బుడగట్లపాలెం, కుప్పిలి, కొయ్యాం, తదితర గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గం గుంతలతో అధ్వానంగా తయారయిందని వాహనదారులు అంటున్నారు. సుమారు 20 గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తూ ఉంటారని వారు తెలిపారు. గుంతలు అధికమవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు.