జిల్లాలో పెరిగిన చలి
NGKL: జిల్లాలో గత వారం రోజులుగా చలితీవ్రత విపరీతంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటలో అత్యల్పంగా బల్మూర్ మండలంలో 9.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్, కల్వకుర్తి మండలాల్లో 9.8, తెలకపల్లి మండలంలో 10.1, పదర మండలంలో 10.4, లింగాల మండలంలో 10.7, తాడూర్ 10.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.