సత్తెనపల్లి మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు

పల్నాడు: సత్తెనపల్లి మున్సిపల్ కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగరవేసి జండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్మన్ లక్ష్మి తులసి, టీడీపీ నాయకులు దరువూరి పాల్గొన్నారు.