ఆయన మృతి బాధాకరం: రేవంత్

TG: సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి మృతికి సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన మృతి బాధాకరమన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి జాతీయనేతగా ఎదిగారని తెలిపారు. వామపక్ష ఉద్యమాలు, ఎన్నో ప్రజా పోరాటాలు చేశారని.. రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన గొప్ప నాయకుడని కొనియాడారు.