VIDEO: చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. షేర్ మార్కెట్ నష్టాలు, ఆన్ లైన్ బెట్టింగ్ కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో పడి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి నుంచి సుమారు 4.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.