రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు మృతి
AKP: నర్సీపట్నం మండలం సుబ్బారాయుడుపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు మృతి చెందినట్లు టౌన్ ఎస్సై రమేష్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఉరుకూటి ఎరుకలమ్మ రోడ్డు పక్కన వెళ్తుండగా బ్రహ్మాజీ అనే యువకుడు బైక్ మీద వచ్చి ఢీకొట్టినట్లు తెలిపారు. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నం KHG ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది అన్నారు.