తెలంగాణ రైతులకు రైతు భరోసా నిధులు

తెలంగాణ రైతులకు రైతు భరోసా నిధులు

WNP: తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 17 నుంచి రైతు భరోసా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. గత వానాకాలంలో సాయం పొందిన రైతులకు ఎలాంటి కోతలు లేకుండా ఈ నిధులు అందుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ యాసంగి సీజన్‌లో దాదాపు 1.46 కోట్ల ఎకరాలకు సాయం అందించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ చెల్లింపుల ప్రక్రియ ప్రారంభం కానుంది.