ఆర్టీసీ కార్మికులు అధైర్య పడొద్దు: ఎంపీ చామల
TG: ఆర్టీసీ ఉద్యోగి శంకర్ గౌడ్ మరణంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు అధైర్యపడి ప్రాణాలు తీసుకోవద్దని, రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందిస్తున్నారని పేర్కొన్నారు. కార్మికులు సమ్మె విరమించి చర్చల్లో పాల్గొనాలని కోరారు.