VIDEO: 'నూర్ భాషా, దూదేకుల సంక్షేమం కోసం కృషి చేస్తా'

KDP: రాష్ట్రంలోని నూర్ భాష, దూదేకుల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తానని నూర్ భాషా దూదేకుల వెల్ఫేర్ & కార్పొరేషన్ డైరెక్టర్ నాగూరు వీరభద్రుడు తెలిపారు. సిద్ధవటం మండలం మాధవరం -1 గ్రామం తన నివాస గృహంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ డైరెక్టర్ పదవికి న్యాయం చేస్తానని వెల్లడించారు. సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు.