నేటి నుంచి జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ రోడ్ షోలు

నేటి నుంచి జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ రోడ్ షోలు

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కోసం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ్టి నుంచి రోడ్ షోలు ప్రారంభించనున్నారు. ఈరోజు షేక్ పేటలో రోడ్ షో నిర్వహించనున్నారు. నవంబర్ 1న రహమత్ నగర్, 2న యూసఫ్‌గూడ, 3న బోరబండలో ప్రచారం చేస్తారు. 4న సోమాజిగూడ, 5న వెంగళరావు నగర్, 6న ఎర్రగడ్డలో కేటీఆర్ పర్యటిస్తారు. నవంబర్ 9న షేక్ పేట నుంచి బోరబండ వరకు BRS బైక్ ర్యాలీ నిర్వహిస్తారు.