'ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలి'
RR: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాజేంద్రనగర్‌లోని ఆయన విగ్రహానికి రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇంఛార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమానత్వం, సామాజిక న్యాయంపై ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.