ఉద్యోగుల జీతాలు ఆపడం దారుణం: CITU
GDWL: ప్రభుత్వ బడులను శుభ్రంగా ఉంచే పేద స్వీపర్లకు ఇచ్చే వేతనాలను నెలల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నారని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ అన్నారు. సోమవారం గద్వాల కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ నరసింహారావుకు వినతిపత్రం సమర్పించారు. డిసెంబర్, జనవరి నెలల వేతనాలు ఇంకా విడుదల కాలేదని అన్నారు.