VIDEO: శ్రీవారి దర్శనానికి భారీగా పోటెత్తిన భక్తులు

NLR: బోగోలు మండలంలోని కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం సందర్భంగా స్వామి వారికి విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అభిషేకం ప్రత్యేక పుష్పాలంకరణలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు శ్రీవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు.