కృష్ణా జిల్లాలోకి వెళ్లిపోనున్న కైకలూరు నియోజకవర్గం
ELR: ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న కైకలూరు నియోజకవర్గం త్వరలోనే కృష్ణా జిల్లాలోకి వెళ్లనుంది. జిల్లాల మార్పుకై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం వెల్లడించిన వివరాల మేరకు.. ఈ మార్పుకై గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. దీంతో ఏలూరు డివిజన్లో ఉన్న కలిదిండి, కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి, మండలాలు గుడివాడ రెవెన్యూ డివిజన్ కిందకు వెళ్లనున్నాయి.