నిజాయితీ చాటుకున్న మహిళ.. రూ. 25 వేలు అప్పగింత

నిజాయితీ చాటుకున్న మహిళ.. రూ. 25 వేలు అప్పగింత

విశాఖ: నిజాయితీ చాటుకున్న కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రి ఎండీ పర్సనల్‌ సెక్రటరీ అనపర్తి షబానా ఆజ్మను గాజువాక పోలీసులు శ‌నివారం ప్రశంసించారు. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మార్గమధ్యలో ఆమెకు దొరికిన రూ. 25 వేలు ఉన్న పర్సును ఆమె వెంటనే గాజువాక పోలీసులకు అప్పగించారు. బాధితుడు డి. సతీష్‌ కుమార్‌గా గుర్తించిన పోలీసులు, పర్సును ఆమె సమక్షంలోనే అతనికి అందజేశారు.