బీచ్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
VSP: విశాఖలోని జోడుగుళ్లుపాలెం బీచ్ ఒడ్డుకు గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకువచ్చింది. మృతుడి వయసు సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఆరిలోవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వివరాలు తెలియకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేశారు.