VIDEO: వరి కోతలు పూర్తైనా ధాన్యం విక్రయాలు రైతులకు కన్నీళ్లే...!!
నల్గొండ జిల్లాలో వరి కోతలు పూర్తయిన ధాన్యం విక్రయాలు రైతులకు కన్నీళ్లు మిగిలిస్తున్నాయి. మిర్యాలగూడ, హాలియా, త్రిపురారం కేంద్రాల్లోని రైస్ మిల్లుల వద్ద కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు బారులు తీరాయి. మిల్లర్లు తేమ శాతం పేరుతో కొర్రీలు పెడుతుండటంతో రోజులు గడిచినా దిగుమతి కావడం లేదు. దీంతో రైతులు తిండి తిప్పలు మాని, రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు.