బెంగళూరులో హోటళ్లు బంద్!
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు నగరవ్యాప్తంగా హోటళ్లను మూసివేయనున్నట్లు ప్రకటించింది. గతంలో చమురు కంపెనీలు 50 రోజుల పాటు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని హామీ ఇచ్చాయని.. కానీ ఇప్పుడు సరఫరాను ఆపివేయడంతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరింది.