VIDEO: 'రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలి'

MLG: తాడ్వాయి మండలం కొత్తూరులో ఇవాళ మేడారం పరిసర పంట నష్టపరిహార సమితి ఆధ్వర్యంలో నాలుగు గ్రామాల రైతులు, అఖిల పక్ష నాయకులు సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మహా జాతరకు కోటి మంది భక్తులు వస్తారని, వారు విడిచిన వ్యర్థాల వల్ల పంటలు పండించలేక పోతున్నామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.