VIDEO: కంభం మండలంలో రెండు ఇళ్ళలో చోరీ

VIDEO: కంభం మండలంలో రెండు ఇళ్ళలో చోరీ

ప్రకాశం: కంభం మండలం నడింపల్లి గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం ఉదయం 2 ఇళ్లల్లో చోరీలు చేయడమే కాకుండా అంగన్వాడి కేంద్రంలో చోరీ చేసేందుకు ప్రయత్నించారు. గ్రామానికి చెందిన అవ్వారి స్వప్న, ఇమాంబి ఇళ్లల్లోకి ప్రవేశించిన దొంగలు బీరువాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. అయితే ఎంత మొత్తంలో బంగారం, నగదు పోయిందో ఇంటి యజమానులు తేల్చి చెప్పాలని పోలీసులు తెలిపారు.