ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన

ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన

ములుగు (మం) పత్తిపల్లిలోని రైతు వేదిక భవనంలో వ్యవసాయ ఉద్యానవన శాఖ, కేన్ బయో సైన్సెస్ కంపెనీ ఆధ్వర్యంలో సంయుక్తంగా రైతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పామ్ ఆయిల్ ఏరియా మేనేజర్ హేమంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ యొక్క సాగు విధానం, నీటి, ఫర్టిలైజర్ యాజమాన్య పద్దతులు, చీడపీడల నుండి రక్షణ గురించి తెలిపారు.