రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థికి ఎంఈవో అభినందన
PDPL: ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాల విద్యార్థి ప్రజ్వల్ రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాల పోటీలకు ఎంపికైన సందర్భంగా ఎంఈఓ ప్రభాకర్ అభినందించారు. ఇవాళ ఎమ్మార్సీలో ప్రజ్వల్‌కు ట్రోఫీని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం నూతి మల్లన్న పాల్గొన్నారు.