నందనం గ్రామ పంచాయతీ భవనానికి రూ.లక్ష విరాళం
HNK: ఐనవోలు మండలంలోని నందనం గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు. ఈ విరాళాన్ని టీపీసీసీ లీగల్ సెల్ వైస్ ఛైర్మన్ నిమ్మాని శేఖర్ రావు శుక్రవారం గ్రామ పంచాయతీకి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.