'మాదకద్రవ్యాల నిషేధం మాకు ఓ సవాల్'

'మాదకద్రవ్యాల నిషేధం మాకు ఓ సవాల్'

SRD: మాదకద్రవ్యాల నిషేధం పోలీసులకు సవాలుగా మారిందని పటాన్ చెరువు DSP ప్రభాకర్ తెలిపారు. పటాన్‌చెరువు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దాదాపు 500 మంది విద్యార్థిని, విద్యార్థుల చేత మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత మాదక ద్రవ్యాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో సీఐ వినాయక్ రెడ్డి, ఎస్సైలు శ్రీశైలం, హిమబిందు పాల్గొన్నారు.