సీఐటీయూ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

SRD: మే 20న సమ్మె జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య అన్నారు. శనివారం జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని కాజిపల్లి గ్రామంలో సీఐటీయూ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.