VIDEO: ఘనంగా కామ దహనం
MDK: తూప్రాన్ మండలంలో ఆదివారం రాత్రి కామ దహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మంగళవారం చంద్రగ్రహణం ఉండడంతో ఆదివారం రాత్రి కామ దహన కార్యక్రమం చేపట్టారు. మండలంలోని మల్కాపూర్, యావపూర్, ఘనపూర్, పట్టణ పరిధి వెంకటాపూర్ (పిటి) తదితర గ్రామాలలో సాంప్రదాయం ప్రకారం ఇంటింటి నుంచి పిడకలు తెచ్చి కాముడు దహనం చేశారు. దహనం సమయంలో మహిళలు పాటలు పాడుతూ దహనం నిర్వహించారు.