అంకూర్ సర్పంచ్ ఏకగ్రీవం.. సన్మానించిన ఎమ్మెల్యే

అంకూర్ సర్పంచ్ ఏకగ్రీవం.. సన్మానించిన ఎమ్మెల్యే

WNP: వనపర్తి మండలం అంకూర్ గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ నుంచి కళావతి వెంకట్ రెడ్డి శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఎమ్మెల్యే మేఘ రెడ్డిని జిల్లా కేంద్రంలో కలిశారు. సర్పంచ్‌ను సన్మానించిన ఎమ్మెల్యే, గ్రామ అభివృద్ధి కోసం ప్రకటించినట్లుగా ఎన్డీఎఫ్ నిధుల నుంచి రూ.20 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.