గంగమ్మ ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం

TPT: తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మ ఆలయ నూతన పాలక మండలి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆలయ ఛైర్మన్ గా మహేష్ యాదవ్‌తో పాటు పాలకమండలి సభ్యులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత ఆలయ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.