నవాబ్ పేటలో పోషణ మాసం కార్యక్రమం
MBNR: నవాబ్ పేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 'పోషణ మాసం' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో జయరాం నాయక్ ఆధ్వర్యంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోప నివారణపై అవగాహన కల్పించారు. ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనే లక్ష్యమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.