వెంకటపాలెం వద్ద E12 రహదారిలో అభివృద్ధి పనులు

వెంకటపాలెం వద్ద E12 రహదారిలో అభివృద్ధి పనులు

GNTR: తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని E12 రహదారిలో అభివృద్ధి పనులు సోమవారం చురుగ్గా సాగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు అడ్డుపడిన మట్టిని సిబ్బంది చదును చేస్తున్నారు. అలాగే రహదారి నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వెంకటపాలెం సమీపంలోని బాహుబలి బ్రిడ్జి వద్ద అండర్ పాస్ రహదారి నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి.