శ్రీ ఏడుపాయలలో పోటెత్తిన వరద

శ్రీ ఏడుపాయలలో పోటెత్తిన వరద

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో మంజీరా నది వరద శనివారం బాగా పెరిగింది. ఎగువన ఘనపూర్ ప్రాజెక్టు నిండి దిగువకు వరద పరవళ్లు తొక్కుతోంది. దాంతో ఏడుపాయల ప్రధాన ఆలయం ఎదుట వరద పోటెత్తింది. ఈ మేరకు దుర్గమ్మ ఆలయం జలదిగ్బంధమవడంతో గుడి వైపు ఎవరిని వెళ్లనివ్వకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.