అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

NLG: కనగల్ మండలం ధర్వేశిపురం పర్వతగిరి గ్రామాల శివారులో గల శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో శుక్రవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకత్వంలో అమ్మవారి అలంకరణ అనంతరం ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. భక్తుల గోత్రనామాలతో అర్చనలు నిర్వహించారు.