'మైలవరం మ్యూజియంను అభివృద్ధి చేయాలి'

KDP: మైలవరం మండలం కేంద్రంలోని చరిత్ర కలిగినటువంటి మ్యూజియంను పురావస్తు శాఖ అధికారులు మరమ్మతులు చేసి అభివృద్ధిలోకి తీసుకొని రావాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విరణాల శివకుమార్ కోరారు. బుధవారం ఆయన మైలవరం మ్యూజియాన్ని సందర్శించారు. మ్యూజియం అధికారుల నిర్లక్ష్యం కారణంగా బూత్ బంగ్లాగా తయారైందన్నారు. పురావస్తు శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించలన్నారు.